KMR: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో కామారెడ్డిలో ఈ నెల 20న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డా. బాలు బుధవారం కలిసి సన్మానం చేశారు. మెగా రక్తదాన శిబిర కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.