HYD: తెలంగాణ ఉన్నత విద్య మండలి వైస్ ఛైర్మన్‌గా ఇటీవల నియమితులైన ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం మంగళవారం టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. పురుషోత్తంకు మధుయాష్కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు కొద్దిసేపు భేటీ అయి పలు విషయాలపై చర్చించారు.