లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు హెజ్బొల్లా సంస్థకు చెందిన 80 శాతం రాకెట్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణశాఖ అంచనా వేసింది. ఆ సంస్థ దగ్గర ఇంకా 20 శాతం రాకెట్లు, క్షిపణులు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని IDF ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకు నివేదించింది.