వికారాబాద్: గ్రూప్-1 విషయంలో కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం బాధాకరమని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ రాజుగౌడ్ అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టిన జీఓ 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్యాయం జరిగిందన్నారు. దీనిపై సుప్రీం కోర్టు ద్వారా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.