SRPT: ముగ్గురు కొడుకులున్నా పిడికెడు అన్నం పెట్టే దిక్కు లేక వృద్ధుడు రోడ్డున పడ్డాడు. సూర్యాపేట LIC కార్యాలయం పక్కన ఆకలితో అలమటిస్తున్నాడు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదంటున్నాడు.పెన్పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన మామిడి అంజయ్య భార్య మూడేళ్ల క్రితం చనిపోయారు. పెద్ద కొడుకు టీచర్, రెండో కొడుకు కూలీ, మూడో కొడుకు కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాడు.