KMM: గిరిజనుల హక్కుల సాధనకై గిరిజనులు సిద్ధం కావాలని LHPS రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు రాజేశ్ నాయక్ అన్నారు. కల్లూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మైదాన ప్రాంతంలో గిరిజనుల కోసం ప్రత్యేక ఐటీడీఏను ప్రభుత్వ ఏర్పాటు చేయాలన్నారు. గిరిజన గ్రామపంచాయతీలను ప్రత్యేక రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలన్నారు. యువ నాయకులు పాల్గొన్నారు.