KMR: గిరిజనుల హక్కుల సాధన బీజేపీతోనే సాధ్యమని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి లంబాడా సోదరులు బీజేపీలో సభ్యత్వం చేసుకోవాలని విన్నవించారు. ఆదివాసీలు గిరిజనులు బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారన్నారు.