SRD: కాంట్రాక్టు కార్మికులకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. చౌటకూరు మండలం శివంపేట పరిధిలోని సీబీఐ పరిశ్రమ వద్ద ప్రచార జాతాను జెండా ఉపి శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీన నిర్వహించే ఛలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బాగా రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.