కరీంనగర్: సింగరేణి సంస్థ ఆర్జీ- 3 ఏరియాలో సెప్టెంబర్ నెలలో 84 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం సుధాకరరావు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్లో ఆర్జి-3 ఏరియాకు నిర్దేశించిన 4.74 లక్షల టన్నుల లక్ష్యానికిగాను 3. 99 లక్షల టన్నులతో 84 శాతం బొగ్గు ఉత్పత్తి, 30.29 క్యూబిక్ మీటర్లతో 79 శాతం ఓబీ వెలికి తీసినట్లు వివరించారు.