ASR: అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్తగా శెట్టి గంగాధరస్వామిని నియమిస్తూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొ న్నారు. ఈ నియామకంపై నియోజకవర్గంలోని పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.