BDK: జిల్లా మణుగూరులో సుమారు 13 కేజీల గంజాయిని ఎస్టిఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైక్ పై ఒడిస్సా నుంచి మహబూబాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మణుగూరులోని అర్బన్ పార్క్ వద్ద మాటు వేసి పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు రెండు బైకులు స్వాధీనం చేస్తున్నారు.