HYD: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ బామ్మర్ది తన సొంత బావను చంపిన ఘటన ఆదివారం రాత్రి గోల్కొండ పరిధిలోని టోలిచౌకిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తన సోదరిని బావ ఇబ్బంది పెడుతున్నాడని బామ్మర్ది అమోదు, తన బావ అయిన సలీంను కత్తితో పొడిచి హత్య చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.