ADB: విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకోవాలని జన్నారం మండల తాహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డి, ఎంపీడీవో శశికళ సూచించారు. బుధవారం జన్నారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వారు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిఓ జలంధర్, ఈవో రాహుల్ పాల్గొన్నారు.