MNCL: ఈ నెల 28వ తేదీన జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సత్వరన్యాయం జరుగుతుందని తెలిపారు. రాజీ మార్గం రాజ మార్గమని, చిన్నచిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని పేర్కొన్నారు.