»If The Pension System Continues The Country Will Be Destroyed Jayaprakash Narayana
Jayaprakash Narayana: పెన్షన్ విధానం కొనసాగిస్తే దేశం నాశనం
గెలుపుకోసం రాజకీయ నాయకులు ఇచ్చే హామీల వల్ల దేశం నాశనం అవుతుందని జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. పెన్షన్ల వల్ల రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత నష్టం జరుగుతుందో వివరించారు.
If the pension system continues, the country will be destroyed.. Jayaprakash Narayana
Jayaprakash Narayana: పెన్షన్(pension) విధానం ఇలానే కొనసాగితే దేశ భవిష్యత్తు సమాధి అయినట్టేనని లోక్సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ(Jayaprakash Narayana) పేర్కొన్నారు. పూర్తి విషయం తెలియకుండా ఊరికే నోరు పారేసుకోనని తెలిపారు. గత 75 ఏళ్లుగా ఎన్నో పొరపాట్లు చేశామని, విధానాల్లో మార్పు రావడం, టెక్నాలజీ పెరగడంతో ఇప్పుడు ఎదిగే అవకాశం కనిపిస్తోందన్నారు. మళ్లీ పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)కు మళ్లితే మనం ఎదిగే అవకాశాన్ని కోల్పోయినట్టేనని, అది జీవన్మరణ సమస్య అవుతుందని అభిప్రాయ పడ్డారు.
రాజకీయ పార్టీలు, నాయకులు హామీలు ఇచ్చే ముందు ఆలోచించాలని సూచించారు.హామీ ఇస్తే దానిని వెనక్కి తీసుకోవాలని అన్నారు. కడుతున్న పన్నులు ఎటుపోతున్నాయో ప్రజలు తెలుసుకోవాలన్నారు. సామాన్యులు వీటి గురించి ప్రశ్నించకుండా ఉండేందుకు కులం, మతం పేరుతో తాత్కాలిక తాయిలాలను ఎరగా వేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల పోరాటం ప్రజల కోసమా? ప్రభుత్వంలో ఉన్న కొద్దిమంది బాగుకోసమా? అన్నది తేల్చుకోవాలన్నారు. తప్పుడు హామీల వలన దేశం, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు.