Realme: బడ్జెట్‌లో రియల్‌మీ కొత్త ఫోన్.. ఫీచర్స్ అదుర్స్

రియల్‌మీ మొబైల్ తయారీ సంస్థ నుంచి కొత్త ఫీచర్లతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ విడుదల అయింది. ఎయిర్ గెశ్చర్స్ టెక్నాలజీని ఈ ఫోన్‌లో ఉంది.

  • Written By:
  • Updated On - April 26, 2024 / 04:11 PM IST

Realme: రియల్‌మీ మొబైల్ సంస్థ గురించి తెలిసిందే. ట్రెండ్‌కు తగ్గట్టు అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులకు కొత్త మొబైల్స్ అందిస్తుంది. చైనాకు చెందిన ఈ మొబైల్‌ సంస్థ తాజాగా సి సిరీస్‌లో బడ్జెట్‌ ధరలో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అది రియల్‌మీ సీ65 5జీ (Realme C65 5G). దీనిలో ఎయిర్‌ గెశ్చర్స్‌ సదుపాయాన్ని కల్పించింది. ఇది మూడు వెరియంట్లలో లభిస్తుంది. అందులో 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధర 10,499 గా నిర్ణయించింది. ఇక 4జీబీ +128జీబీ ధర రూ.11,499. అలాగే 6జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.12,499గా కంపెనీ పేర్కొంది. ఈ మొబైల్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. ఫెదర్‌ గ్రీన్‌, గ్లోయింగ్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తోంది.

చదవండి:Elon Musk: యూట్యూబ్‌కి పోటీగా ఎక్స్ టీవీ యాప్

ఈ మొబైల్ కొనుగోలు చేసిన వారికి ఆఫర్ కూడా అందిస్తుంది. అందులో భాగంగా క్రెడిట్ కార్డుతో కొనేవారికి 4జీబీ వేరియంట్‌పై రూ.500, 6జీబీ వేరియంట్‌పై రూ.1,000 డిస్కౌంట్‌ కల్పిస్తుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. రియల్‌మీ సీ65 5జీ (Realme C65 5G) ఆండ్రాయిడ్‌ 14 (Android 14), యూఐ 5.0తో పనిచేస్తుంది. 6.67 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే.. 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 625 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ లభిస్తుంది. 50 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే 5,000mAh.. 15W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

చదవండి:NOTA: నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేయాలి.. ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

Related News

Moto Earbuds: మోటో కొత్త ఇయర్‌బడ్స్.. ఫీచర్లు ఇవే!

ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ మోటో కొత్త ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. మోటో బడ్స్, మోటో బడ్స్+ పేరుతో రెండు మోడల్స్‌ను ఆవిష్కరించింది. మరి దీని ధర, ఫీచర్లు ఏంటో తెలుస్తుంది.