మీరు ఆన్ లైన్ గేమ్స్ ఆడుతారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే త్వరలోనే యూట్యూబ్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే YouTube "ప్లేబుల్స్" ఆ ఫీచర్‌ని పరీక్షిస్తున్నట్లు ప్రకటించారు. ఇది త్వరలోనే వినియోగదారులకు నేరుగా అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
నాసా శాస్త్రవేత్తలు చేసిన మరో ప్రయోగం సక్సెస్ అయ్యింది. మూత్రం, చెమట నుంచి మంచినీటిని తయారు చేసే విధానం సక్సె అయ్యిందని నాసా ప్రకటించింది. దీని వల్ల భవిష్యత్ తరాలకు నీటి సమస్య తీరుతుందని తెలిపింది.
చైనాకు చెందిన బైడు కంపెనీ ఎర్నీ బాట్ చాట్ జీపీటీని ఆవిష్కరించింది. లాంచింగ్ కార్యక్రమంలోనే నెగిటివ్ వచ్చింది. ఎక్కువ మంది లేకపోవడం, ప్రీ రికార్డెడ్ వీడియోలు పొందుపరచడంతో నెగిటివ్ వెళ్లింది. దీంతో ఆ కంపెనీ షేర్లు పడిపోయాయి.
హైదరాబాద్ లోని ఉప్పల్ లో స్కైవాక్ బ్రిడ్జ్ ప్రారంభం కానుంది. నగరంలో మరికొన్ని స్కైవాక్ బ్రిడ్జ్ లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉప్పల్ స్కైవాక్ బ్రిడ్జ్ ప్రారంభం అవ్వనుంది.
ప్రఖ్యాత చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యూనిహెర్ట్జ్ 3 అంగుళాల డిస్‌ప్లే, పారదర్శక డిజైన్‌తో ‘జెల్లీ స్టార్’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫోన్ ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది.
ఈ-పాస్‌పోర్ట్ కోసం నిరీక్షణకు ఇప్పుడు తెరపడనుంది. పాస్‌పోర్ట్ సేవా దివాస్ సందర్భంగా త్వరలో పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0ని ప్రారంభించనున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు.
లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగదారులు ధైర్యంగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. ఈ-కామర్స్ కంపెనీలపై పెరిగిన నమ్మకం.. అవి అందించే సేవలు, కస్టమర్ సపోర్ట్ ఇందుకు కారణమని చెప్పవచ్చు.
మార్కెట్లోకి సామ్‌సంగ్ రెండు స్మార్ట్ వాచెస్ రాబోతున్నాయి. ఆ వాచ్‌లకు సంబంధించిన ఫీచర్లు అప్పుడే బయటకు వచ్చాయి.
మిస్టర్ మస్క్(Elon Musk) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో మిస్టర్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg)తో "కేజ్ ఫైట్‌కు సిద్ధంగా ఉన్నానని" సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా బాస్ అయిన మిస్టర్ జుకర్‌బర్గ్, "నాకు లొకేషన్ పంపండి" అనే క్యాప్షన్‌తో మిస్టర్ మస్క్ ట్వీట్ యొక్క స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
పింక్ వాట్సాప్(Pink Whatsaap) పేరుతో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే వారినే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. పాత దానికి అప్ గ్రేడ్ వర్షన్ అని ఇందులో బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయని కేటుగాళ్లు ఊదరగొడతారు.
అమోజాన్లో బంపర్ ఆఫర్ సేల్స్ నడుస్తున్నాయి. OnePlus, Mi, Redmi వెస్టింగ్‌హౌస్ స్మార్ట్ టీవీలను బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లతో పొందవచ్చు.
త్వరలో హోండా కంపెనీ కొత్త వెర్షన్ బైక్‌ని మార్కెట్లోకి తీసుకురానుంది.
అమెజాన్‌పై ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తీవ్ర ఆరోపణలు చేసింది. అమెజాన్ సంస్థ మిలియన్ల మంది వినియోగదారులను మోసం చేసిందని ఆరోపిస్తోంది.
5G ఆవిర్భావంతో నెట్‌వర్క్ స్పీడ్ వేగంగా మారింది. Airtel, Jio వంటి కంపెనీలు కూడా అద్భుతమైన ప్లాన్‌లను అందిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం 5G నెట్ వర్క్ తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో 5జీ ఫీచర్లతో అందుబాటులో ఉన్న ఐఫోన్ 12 మంచి ఆఫర్ ధరకు లభ్యమవుతుంది.
జేబులో ఉండే సెల్ ఫోన్ నుంచి ఇంట్లో వాడుకునే వస్తువుల వరకు అన్నీ ప్లాస్టిక్ తో చేసినవే. మనం ఈ ప్లాస్టిక్ వస్తువులను వాడినప్పుడు మనకు తెలియకుండానే అవి కొద్దికొద్దిగా విరిగిపోతాయి. విరిగిన ప్లాస్టిక్ దుమ్ము గాలిలో కలిసిపోతుంది.