Samsung 5G Mobile: శామ్సంగ్ (Samsung) కంపెనీ కొత్త 5జీ మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. గలాక్సీ ఎం34 మొబైల్ త్వరలో భారతదేశంలో రిలీజ్ చేయనుంది. వచ్చే నెల 7వ తేదీన స్మార్ట్ ఫోన్ దేశంలో అందుబాటులోకి రానుంది. మొబైల్ ఫీచర్లు లీక్ అయ్యాయి. ఎం34లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50 మెగా పిక్సెల్ నో షేక్ కెమెరా ఉందట.
శాంసంగ్ (Samsung) గలాక్సీ ఎం34 5జీ స్మార్ట్ ఫోన్ మాన్ స్టర్ షాట్ 2.0 ఫీచర్ కలిగి ఉంది. దీంతో కొత్త ఫొటోగ్రపీ అనుభవం పొందుతారట. ఈ ఫీచర్ కెమెరా వెనక ఉన్న ఏఐ ఇంజిన్‌కు శక్తి ఇస్తోంది. వినియోగదారులు ఒకే షాట్లో 4 వీడియోలు, 4 ఫోటోలను క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది. 48 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ సెకండరీ కెమెరా, 5 ఎంపీ కెమెరా ఉండనుంది. సెల్ఫీల కోసం 13 ఎంపీ కెమెరా ఇచ్చారు. మొబైల్ 120 హెచ్జడ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోంది. విజన్ బూస్టర్ టెక్నాలజీతో రానుంది. సూర్యకాంతిలో కూడా స్క్రీన్ అద్భుతంగా కనిపిస్తోందట. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఒకసారి ఛార్జీ చేస్తే రెండు రోజులు వరకు పనిచేస్తోంది. చార్జీంగ్ కోసం టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. మొబైల్ ధర రూ.20 వేలలోఉండే అవకాశం ఉంది.
6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే ఇచ్చారు. సెల్ఫీ కెమెరాతో వాటర్ డ్రాప్- స్టైల్ నాచ్డ్ డిజైన్ ఉంది. మొబైల్ హుడ్ కింద మీడియోటెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ ఉంది. కొత్త ఆండ్రాయిడ్ వర్షన్లో మొబైల్ రానుంది. స్లిమ్‌గా ఉండటంతో వినియోగదారులను ఆకట్టుకోనుంది. మిడ్ రేంజ్లో ధర ఉండటంతో.. సేల్స్ పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది.