నేపాల్, యూఎస్ఏ మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్ ఊహించని మలుపులు తిరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో యూఎస్ఏ మొదట దూకుడుగా ఆడినా చివర్లలో వికెట్లు కోల్పోవడంతో 170 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్లో యూఎస్ఏ కేవలం రెండు పరుగులు మాత్రమే చేయగా.. నేపాల్ 4 బంతుల్లోనే విజయం సాధించింది.