శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో లంక 602 పరుగులు చేయగా.. కివీస్ జట్టు 88 పరుగులకే కుప్పకులింది. 22/2 పరుగులతో 3వ రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్.. లంక బౌలర్ల దాటికి కేవలం మరో 66 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. దీంతో లంకకు తొలి ఇన్నింగ్స్లో 514 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఫాలోఆన్ ప్రారంభించిన న్యూజిలాండ్ 121 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది.