మహిళల క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌ల ఆడిన క్రికెటర్‌గా న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ రికార్డ్ సృష్టించింది. ఈ రికార్డ్ భారత క్రికెటర్ మిథాలీ రాజ్(333) పేరుతో ఉండేది. తాజాగా మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో సుజీ బేట్స్ ఆడి ఈ రికార్డ్‌ను తిరగరాసింది. ప్రస్తుతం ఆమె 163 వన్డేలు, 171 టీ20 మ్యాచ్‌లతో కలిపి మొత్తం 334 మ్యాచులు పూర్తి చేసుకుంది.