బెంగళూరు వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్ – భారత్ టెస్టు మ్యాచ్ ఐదో రోజు ఆట ఈ ఉదయం 9.15 గంటలకు ప్రారంభం కావాలి. కానీ, ఆ సమయంలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెదర్ రిపోర్ట్ సమాచారం. వర్షం పడితే మ్యాచ్ నిర్వహణ కష్టంగా మారడం ఖాయం. ఇవాళ ఉదయం నుంచే బెంగళూరులో ఆకాశం మేఘావృతమై ఉంది. ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ డ్రాగా ముగియనుంది. కాగా, న్యూజిలాండ్ ముందు భారత్ 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.