గాయంతో జట్టుకు దూరం అయిన షమీ పునరాగమనం కోసం సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ముగిసిన తర్వాత ఎం చిన్నస్వామి స్టేడియంలోని ప్రధాన పిచ్ పై షమీ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. భారత్ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్‌కు సమారు గంటకు పైగా బౌలింగ్ చేశాడు. అయితే షమీ తన ఎడమ మోకాలికి మాత్రం పెద్ద పట్టీని కట్టుకొని ఉన్నాడు.