రెండు టెస్టుల సిరీస్లో భాగంగా శ్రీలంక వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో లంక 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో లంక 305 పరుగులు చేయగా.. కివీస్ జట్టు 340 పరుగులు చేసి 35 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్లో లంక 309 పరుగులతో రాణించండంతో 275 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ముందుంచింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 211 పరుగులకే కుప్పకూలింది.