న్యూజిలాండ్ జట్టు కొత్త కెప్టెన్గా మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు. ఈ మేరకు న్యూజిలాండ్ సెలెక్టర్లు ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీలంకతో నవంబర్లో జరగబోయే టీ20, వన్డే సిరీస్లలో సాంట్నర్ తాత్కలిక కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. కాగా ఇటీవలే కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ కెప్టెన్గా వైదొలిగిన విషయం తెలిసిందే.