బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ ఆల్‌టైం వరల్డ్ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్న అతడు.. సుదీర్ఘ ఫార్మాట్లో బాల్స్ పరంగా అత్యంత వేగంగా ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో పాకిస్థాన్ బౌలర్ వకార్ యూనిస్ 12,602 బంతుల్లో ఈ ఘనత సాధించగా.. రబాడ మాత్రం 11,817 బంతుల్లోనే 300 వికెట్లు పడగొట్టాడు.