కివీస్‌తో టెస్ట్ సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో కోచ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు సీనియర్ ఆటగాళ్లకు ఇస్తోన్న ‘ఆప్షనల్ ట్రైనింగ్’ సెషన్‌ను రద్దు చేశారు. కోహ్లీ, రోహిత్, బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు గాయపడితే ఇబ్బంది అవుతుందని వారికి ట్రైనింగ్ సెషన్ ఆప్షనల్‌గా ఉండేది. కానీ ఇప్పుడు ఏ ఒక్కరూ మినహాయింపు కాదు.. ట్రైనింగ్ సెషన్లో ప్రతి ఆటగాడు పాల్గోవాలని కోచ్ గంభీర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.