ఇంగ్లాండ్‌పై మంచి విజయం తర్వాత ఆప్గానిస్తాన్(Afghanistan) జట్టు కీలకమైన ప్రపంచ కప్ మ్యాచ్‌లో నేడు న్యూజిలాండ్(New Zealand)తో తలపడుతుంది. ఇక మొదట టాస్ గెల్చిన ఆప్గాన్ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది. అయితే ఈ కీలక మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023(ICC World Cup 2023)లో నేడు న్యూజిలాండ్(New Zealand), ఆప్గానిస్తాన్(Afghanistan) జట్ల మధ్య 16వ మ్యాచ్ మొదలైంది. టాస్ గెల్చిన ఆప్గాన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ జట్లలో ఏ టీం గెలుస్తుందో ఓసారి చుద్దాం. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌పై సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆప్గానిస్తాన్ జట్టుపై చెలరేగేందుకు సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండటంతో న్యూజిలాండ్ మూడు విజయాలతో బలమైన నెట్ రన్ రేట్‌తో రెండవ స్థానంలో ఉంది. ఈ టోర్నమెంట్లో అతిపెద్ద జట్లలో ఒకటిగా నిలిచిన ఆప్గాన్ ఆరో స్థానాన్ని ఆక్రమించింది.
ఈ వేదిక వ్యూహాత్మకంగా ప్రవీణులైన వారికి ప్రధానంగా స్పిన్ బౌలింగ్‌కు వ్యతిరేకంగా నైపుణ్యం ఉన్నవారికి అనుకూలంగా ఉంటుందని నిపుణలు చెబుతున్నారు. మరోవైపు సీనియర్ బ్యాట్స్‌మెన్స్ ఇక్కడ భారీగా స్కోర్ చేసేందుకు అవకాశం ఉందని అంటున్నారు. ఈ మ్యాచ్ రెండు జట్లకు కూడా కీలకం కానుంది. న్యూజిలాండ్ తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తుండగా.. మరోవైపు ఆప్గానిస్తాన్ కూడా తన కొత్త ఊపును కొనసాగించాలని కోరుకుంటోంది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో మరింత పైకి పోవాలని ప్రయత్నిస్తోంది.
న్యూజిలాండ్ జట్టులో డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (కెప్టెన్, wk), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, మార్క్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్ ఉన్నారు.