లైగర్ సినిమా రిలీజ్‌కు ముందు ఎంత రచ్చ చేశాడో.. రిలీజ్ తర్వాత కూడా తగ్గేదేలే అంటున్నాడు విజయ్ దేవరకొండ. దాంతో ప్రస్తుతం రౌడీ గురించి సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు రౌడీ ఫ్యాన్స్. ఇక లైగర్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. వెంటనే వర్కౌట్స్ స్టార్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం భారీగానే కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా.. ఇండియా-పాక్ మ్యాచ్‌లో కనిపించి.. లైగర్‌ను మరింతగా ప్రమోట్ చేశాడు. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు పలువురు ఇండియన్ క్రికెటర్లను కలిశాడు విజయ్. అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు విజయ్. ‘ఏ క్రికెటర్ బయోపిక్‌లో నటించడానికి ఆసక్తిగా ఉన్నారని అడగ్గా.. ‘ఇప్పటికే ధోని బయోపిక్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చేసేశాడు కాబట్టి.. విరాట్ కోహ్లీ బయోపిక్ చేయడానికి రెడీ ఉన్నానని..’ చెప్పుకొచ్చాడు విజయ్.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవేళ నిజంగానే విజయ్.. విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటిస్తే.. సెన్సేషనల్‌గా నిలవడం పక్కా అని అంటున్నారు. ఇకపోతే.. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వాటిలో ఒకటి పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ కాగా.. ఇంకొకటి శివ నిర్వాణ దర్శతక్వంలో ‘ఖుషీ’ అనే సినిమా చేస్తున్నాడు. లైగర్‌లో అనన్య పాండేతో రొమాన్స్ చేసిన విజయ్.. జనగణమనలో పూజా హెగ్డే, ఖుషీ మూవీలో సమంతతో ఆడిపాడనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలు కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. అయితే బ్యాక్ పెయిన్ కారణంగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోనున్నాడట విజయ్. అందుకే రౌడీ కాస్త గ్యాప్ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.