»Sachin Tendulkar Lauds Young Girls Batting Skills
Sachin Tendulkar: స్కూల్ గర్ల్ షాట్లకు మాస్టర్ ఫిదా
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఓ స్కూల్ గర్ల్ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యారు. నిన్ననే డబ్ల్యూపీఎల్ వేలం ముగిసింది... ఈ రోజు మ్యాచ్ ప్రారంభం అయింది... ఎంత విశేషం... నీ బ్యాటింగ్ చూసి చాలా ఎంజాయ్ చేశాను అంటూ లిటిల్ మాస్టర్ ఆమె బ్యాటింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఆమె సూర్యకుమార్ ఆట తీరును చూసి, అతనిలా లాంగ్ షాట్స్ కొట్టే మెళకువలు కూడా తెలుసుకోవాలని సూచించారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఓ స్కూల్ గర్ల్ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యారు. నిన్ననే డబ్ల్యూపీఎల్ వేలం ముగిసింది… ఈ రోజు మ్యాచ్ ప్రారంభం అయింది… ఎంత విశేషం… నీ బ్యాటింగ్ చూసి చాలా ఎంజాయ్ చేశాను అంటూ లిటిల్ మాస్టర్ ఆమె బ్యాటింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఆమె సూర్యకుమార్ ఆట తీరును చూసి, అతనిలా లాంగ్ షాట్స్ కొట్టే మెళకువలు కూడా తెలుసుకోవాలని సూచించారు. నెటిజన్లు కూడా ఆమె బ్యాటింగ్ స్కిల్స్‌కు ముగ్ధులవుతున్నారు. ఫిమేల్ వర్షన్ సూర్యకుమార్, లేడీ సూర్య కుమార్, నెక్స్ట్ టెండుల్కర్… అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తన కొత్త పేవరేట్ క్రికెటర్, నేను 100 డాలర్లు బెట్ కడుతున్నాను, ఆమె భారత్ తరఫున ఆడితే, సూపర్ స్టార్ కావడం ఖాయం అంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు.
ఈమె రాజస్థాన్‌లోని బర్మార్‌లోని షెర్పురా కనసారా గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని. పేరు ముమల్ మెహర్. వయస్సు 14. ఈమె బ్యాటింగ్ తీరుకు అందరూ ముచ్చటపడుతున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. మంగళవారం రాజస్తాన్ భారతీయ జనతా పార్టీ చీఫ్ సతీష్ పూనియా ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ఆమెకు క్రికెట్ కిట్‌ను పంపించారు. తాను భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ స్టైల్‌ను చూస్తుంటానని చెప్పారు. లాంగ్ షాట్స్ కోసం ప్రయత్నిస్తుంటానని వెల్లడించారు. రోజుకు మూడు నుండి నాలుగు గంటల పాటు క్రికెట్ ఆట ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు. తనకు రోషన్ ఆటలో మెలకువలు నేర్పించుతున్నారని, ఇటీవలే గ్రామపంచాయతీ లెవల్ నుండి జిల్లాస్థాయి వరకు జరిగిన రూరల్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నానని చెప్పారు. దురదృష్టవశాత్తూ తమ జట్టు ఓడిపోయిందన్నారు.
తన గ్రామంలో తన సోదరి అనిషా కూడా క్రికెట్ బాగా ఆడుతుందని చెప్పారు. టిప్స్ ఇస్తుందన్నారు. అనిషా, తాను కలిసి రూరల్ ఒలింపిక్స్‌లో ఆడినామని, తనకు అవకాశం వస్తే బయట ఆడుతున్నట్లు చెప్పారు. తనకు క్రికెట్ అంటే ఎంతో ప్రాణమని, గ్రామాల్లో అమ్మాయిలు క్రికెట్ తక్కువగా ఆడుతారు కాబట్టి తాను అబ్బాయిలతో కలిసి కూడా ఆడుతానని చెప్పారు. తాను తొమ్మిదేళ్ల వయస్సు నుండే క్రికెట్ ఆడుతున్నానన్నారు. అనిషా రాజస్థాన్ అండర్ 19కు ఎంపిక అయిన తర్వాత తనకు ఈ ఆట పట్ల ఆసక్తి, మక్కువ పెరిగిందన్నారు. ముమల్ మెహర్‌కు ఏడుగురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఈమె స్కూల్‌కు వెళ్లడానికి రోజు మూడు కిలోమీటర్లు నడుస్తున్నట్లు బంధువు ఒకరు చెబుతున్నారు. మెహర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. 12000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుత సోషల్ మీడియా ప్రచారం కారణంగా ప్రభుత్వం నుండి ఆమెకు సహకారం అందుతుందని భావిస్తున్నట్లు రోషన్ ఆశిస్తున్నారు.
కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. నమ్మశక్యం కాని షాట్స్ అంటూ కామెంట్ పెట్టారు. బార్మర్‌కు చెందిన ఈ యువతి బంతిని చాలా తేలిగ్గా తన బ్యాట్‌తో కొట్టే విధానాన్ని చూడండి అంటూ పేర్కొన్నారు.
ఈ వీడియో చూసిన ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాతి మలివాల్ స్పందించారు. ఆమె ప్రతిభను గుర్తించి, పోత్రహించాలని, దాంతో, ఆమెకు ట్రైనింగ్ తీసుకునే అవకాశం దొరుకుతుందని పేర్కొన్నారు.