PKL 11 సీజన్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై తమిళ్ తలైవాస్ 44-25 తేడాతో ఘన విజయం సాధించింది. తమిళ్ తలైవాస్ ఈ సీజన్లో మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. మరోవైపు ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ జెయింట్స్‌కు ఇది మూడో పరాజయం. తలైవాస్ స్టార్ రెయిడర్ నరేందర్ 20 సార్లు కూతకెళ్లి 15 పాయింట్లు సాధించాడు.