రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది. రాయ్‌పూర్‌లో గల షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఫస్ట్ వన్డే ఆడిన టీమ్‌తోనే రోహిత్ శర్మ బరిలోకి దిగారు. ఫిన్ అలెన్‌ను ఐదో బంతికి మహ్మద్ షమీ బౌల్డ్ చేశాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ వన్డే జరిగిన సంగతి తెలిసింది. ఆ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ బాదడంతో టీమిండియా న్యూజిలాండ్‌కు భారీ లక్ష్యం నిర్దేశించింది.