బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా టీ బ్రేక్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 438 పరుగులు చేసింది. 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. సర్ఫరాజ్ ఖాన్ (150) అదరగొట్టాడు. రిషభ్ పంత్ (99) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. కోహ్లీ (70), రోహిత్ (52), జైశ్వాల్ (32) పరుగులు చేశారు. క్రీజులో రవీంద్ర జడేజా(4*) ఉన్నాడు.