బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఐదో రోజు ఆట వర్షం, స్టేడియంలో చిత్తడి వల్ల ఆలస్యమవుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 4 బంతులాడి 0/0 పరుగులు చేసింది. కివీస్ విజయానికి 107 పరుగులు కావాలి. తొలి ఇన్నింగ్స్లో IND 46, NZ 402 పరుగులు.. రెండో ఇన్నింగ్స్లో భారత్ 463 పరుగులు చేసింది. ఇవాళ ఆట చివరి రోజు కావడంతో ఉత్కంఠ నెలకొంది.