»Harbhajan Singh Tears Into Tweet Praising Ms Dhoni
Dhoni V/S భజ్జీ: ఉత్తమ కెప్టెన్ అని ఫ్యాన్స్ ప్రశంసలు, టీమ్ విజయం అంటోన్న హర్భజన్
డబ్ల్యూసీ ఫైనల్లో భారత్ ఓటమి తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ధోని నేతృత్వంలో 3 కప్స్ సాధించారని అతనిపై ప్రశంసలు కురిపించారు. ఆ కామెంట్లను హర్బజన్ సింగ్ తప్పుపట్టారు. ఓ జట్టుగా విజయం సాధించారని తెలిపారు.
Harbhajan Singh tears into tweet praising MS Dhoni
Harbhajan Singh: డబ్ల్యూసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చతికిలపడింది. 209 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇతర ఇండియన్ క్రికెటర్లపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు భగ్గుమంటున్నారు. వీరి కన్నా ధోని నయం.. అతను ఎన్ని కప్స్ తీసుకొచ్చాడు అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్విట్టర్, ఇన్ స్టలో పోస్టులు చేస్తున్నారు. దీంతో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) స్పందించారు.
టీమ్‌గా ఆడి గెలిచారు
క్రికెట్ అంటే టీమ్ అని హర్భజన్ సింగ్ (Harbhajan Singh) అన్నారు. అంతే తప్ప ఒకరి వల్ల కాదని స్పష్టంచేశారు. అదేం ఇండివిడ్యువల్ గేమ్ కాదన్న ఆయన.. ధోని ఒంటరిగా ఆడలేదన్నారు. మిగతా 10 మంది ప్రభావం లేకుండానే ఆ సిరీస్, కప్స్ ధోని (dhoni) గెలిచాడా అని ప్రశ్నించారు. వరల్డ్ కప్, ఇరానీ ట్రోపీ, ఆస్ట్రేలియా.. ఇతర కప్స్ ఒక్కరి వల్ల గెలవలేదని చెప్పారు. ఏ మ్యాచ్ గెలిచిన అదీ భారత విజయం, ఇండియా కెప్టెన్ విజయం, జట్టు విజయం అవుతుందని తేల్చిచెప్పారు. విజయం సాధించినప్పుడు పంచుకోవాలి.. ఓడిపోయిన సమిష్టిగా బాధ్యత వహించాలని స్పష్టంచేశారు.
మేజర్ టైటిల్స్
మహేంద్ర సింగ్ ధోని (dhoni) నేతృత్వంలో ఇండియా మూడు మేజర్ టైటిల్స్ కొట్టింది. టీ 20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోపీ గెలిచింది. ధోని సారథ్యంలో టీమిండియా కప్స్ గెలిచాయని.. క్రికెట్ అభిమానులు అంటున్నారు. ధోని పేరుతో మిమ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ధోనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ ట్వీట్ హర్భజన్ చూసి.. ఇలా స్పందించారు. ఆ సమయంలో మిగతా 10 మంది కూడా ఆడారని.. వారి ప్రతిభతోనే కప్స్ గెలవగలిగారని చెప్పారు.