టీ20 ప్రపంచకప్ 2026లో బంగ్లాదేశ్ మ్యాచ్‌ల వేదికలపై వివాదం నెలకొంది. ఈ వ్యవహారంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. బంగ్లా మ్యాచ్‌ల వేదికల మార్పుకు సంబంధించి ఐసీసీ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించాడు. ఈ అంశంతో తమకు సంబంభం లేదని.. ఇది BCB, ICC మధ్య కమ్యూనికేషన్‌కు సంబంధించిన విషయమని తెలిపాడు.