VZM: బహిర్భూమికి రోడ్డు దాటుతూ మృతి చెందిన ఘటన ఎస్.కోట పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. సీఐ నారాయణమూర్తి తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పోతనాపల్లి గ్రామానికి చెందిన పొట్నూరు వెంకటలక్ష్మి బహిర్భూమికి వెళ్తున్న సమయంలో ద్విచక్ర వాహనం గుద్దినట్లు చెప్పారు. స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యుడు ధృవీకరించారు.