నేటి వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో పాక్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో పాక్ పరిస్థితి ఘోరంగా మారింది. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే మూడు జట్లు సెమీస్ చేరాయి. నాలుగో బెర్త్ కోసం న్యూజిలాండ్ ఉంది. సాంకేతికంగా పాక్‌కు కూడా సెమీస్ అవకాశాలు ఉన్నాయి. అయితే అది సాధ్యం అయ్యే పని కాదని తేలిపోయింది. నేటి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.
పాక్ సెమీస్ చేరాలంటే 338 టార్గెట్‌ను 6.4 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంటుంది. అప్పుడే న్యూజిలాండ్‌ను పాయింట్ల పట్టికలో వెనక్కి నెట్టగలదు. అయితే ఆ రన్ రేట్‌ను పాక్ అందుకునే అవకాశం లేదు. దీంతో ఈ మ్యాచ్‌పై పాక్ ఆశలు వదులుకుంది. 338 లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన పాక్‌కు వరుస షాకులు తగిలాయి. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ మొదలి ఓవర్లోనే డకౌట్ అవ్వడంతో పాక్ అభిమానులు షాక్ అయ్యారు.
ఆ తర్వాత మరో బ్యాటర్ జమాన్ కూడా ఒక పరుగు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ బాబర్ అజామ్, వైస్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌లు ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ 84 పరుగులు చేయగా రూట్ 60, కెప్టెన్ జోస్ బట్లర్ 27, హ్యారీ బ్రూక్ 30 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3, షహీన్ అఫ్రిది 2, మహ్మద్ వసీం 2, ఇఫ్తికార్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు.