బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్‌పై టీమిండియా ఇంతటి భారీ స్థాయిలో గెలుస్తుందని అనుకోలేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ వ్యాఖ్యానించాడు. అక్కడ ఆడటం విదేశీ జట్లకు చాలా కష్టమని తెలిపాడు. టాస్ ఓడి బ్యాటింగ్ తీసుకోవడం ఒక ఎత్తు అని పేర్కొన్నాడు. కొత్త బంతితో బుమ్రా ప్రత్యర్థి బ్యాటర్లను కకావికలం చేశాడని చెప్పుకొచ్చాడు.