»Asia Cup 2023 Team India Openers Rohit Shubman Gill Half Century
Asia Cup 2023 : అదరగొడుతోన్న టీమిండియా ఓపెనర్లు.. రోహిత్, శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ
ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు భారత్, పాక్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ విరుచుకుపడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు.
ఆసియాకప్ (Asia Cup 2023) సూపర్4 మ్యాచ్లో టీమిండియా (TeamIndia) ఓపెనర్లు అదరగొడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ (RohithSharma), శుభ్మన్ గిల్ (SubhmannGill) హాఫ్ సెంచరీలు చేశారు. రోహిత్ శర్మ పాక్ బౌలర్ షాదాబ్ ఖాన్ వేసిన 15వ ఓవర్లో సిక్సర్ బాది అర్థశతకాన్ని నమోదు చేశాడు. అంతకుముందే షాదాబ్ వేసిన 13వ ఓవర్లో శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు.
ఇద్దరూ పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. 15 ఓవర్లకు టీమిండియా వికెట్ కోల్పోకుండా 115 పరుగులు చేశాడు. సెప్టెంబర్ 2న భారత్, పాక్ మ్యాచ్ జరగలేదు. వరుణుడి కారణంగా ఆ మ్యాచ్ విఫలమైంది. పాక్ పేసర్ అయిన త్రయంపై టీమిండియా బ్యాటర్లు విరుచుకుపడుతున్నారు.
పాక్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రీదీని శుభ్మన్ గిల్ టార్గెట్ చేసి బౌండరీలు బాదాడు. 5వ ఓవర్లో ఏకంగా మూడు బౌండరీలు బాది విరుచుకుపడ్డాడు. నసీం షా వేసిన 9వ ఓవర్లో గిల్ రెండు ఫోర్లు బాదాడు. రోహిత్ శర్మ 56 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 16.4 ఓవర్లో 121 పరుగుల వద్ద రోహిత్ వికెట్ను భారత్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో శుభ్మన్ గిల్2తో పాటు విరాట్ కోహ్లీ ఉన్నాడు.