అండర్-19 ఆసియాకప్ ఫైనల్కు భారత్ దూసుకెళ్లింది. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ 21.4 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ (67) అర్ధశతకం, ఆయుష్ మాత్రే (34) రాణించారు. లంక బౌలర్లు విహాస్, విరన్, ప్రవీణ్ తలో వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 173 పరుగులకు ఆలౌట్ అయింది.