కూచ్ బెహార్ ట్రోఫీ అండర్-19 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగారు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో గోవాతో జరుగుతున్న మ్యాచ్లో HYD ఓపెనర్ ఆరన్ జార్జి 33 ఫోర్లతో 219 పరుగులు చేసి డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. సిద్ధార్థ్ రావు(101), యశ్వీర్(111*) సెంచరీలు సాధించడంతో HYD 604/9 పరుగుల భారీ స్కోర్ చేసి డిక్లేర్డ్ చేసింది. గోవా ఆట ముగిసే సమయానికి 139/0 పరుగులు చేసింది.