శ్రీలంకతో జరుగుతోన్న రెండో టీ20లో న్యూజిలాండ్ బౌలర్ లాకీ ఫెర్గుసన్ హ్యాట్రిక్ సాధించాడు. ఆరో ఓవర్ చివరి బంతికి కుసల్ పెరీరా(3)ను అవుట్ చేశాడు. అనంతరం 8వ ఓవర్లో కమిందు మెండిస్(1)ను మొదటి బంతికి, తర్వాతి బంతికి శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక(0)ను అవుట్ చేశాడు. దీంతో ఛేదనలో శ్రీలంక 34 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం 108 రన్స్‌కు ఆలౌట్ అయింది.