ఐపీఎల్ రిటెన్షన్‌లో పంజాబ్ కింగ్స్ కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే తమ వద్ద అట్టిపెట్టుకుంది. ఈక్రమంలో తనను రిటైన్ చేసుకున్న పంజాబ్ ఫ్రాంచైజీకి, కోచ్ రికీ పాంటింగ్‌కు ప్రభ్ సిమ్రన్ సింగ్ ధన్యవాదాలు తెలిపాడు. అయితే, గతంలో ఢిల్లీకి కోచ్‌గా ఉన్నప్పుడు రికీ తనను తీసుకోవాలని బలంగా కోరుకున్నట్లు ప్రభ్ వెల్లడించాడు. అలాగే, రికీతో పనిచేసేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.