కొంతమంది హైకోర్టు రిటైర్డ్ జడ్జిలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకే పింఛను లభిస్తుండటంపై సుప్రీం కోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తక్కువ పింఛను విషయంలో ఓ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారించింది. ‘రూ.6 వేలు, రూ.15 వేల పింఛను పొందడం దిగ్భ్రాంతికరం. అలా ఎలా సాధ్యం?’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం ఈ కేసును నవంబర్ 27కి వాయిదా వేసింది.