అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 2 సెకన్లలోనే ప్రత్యేక న్యాయవాది జాక్ స్మిత్‌ను తొలగిస్తానని వెల్లడించారు. ఆయనను క్షమించేది లేదన్నారు. స్మిత్‌ను 2022లో అటార్నీ జనరల్ మెర్రిక్ గార్లాండ్ నియమించారు. ఆయనను తొలగించడం తాను మొదటగా చేయబోయే పనుల్లో ఒకటని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ట్రంప్‌పై రెండు ఫెడరల్ కేసుల్లో స్మిత్ వాదనలను వినిపిస్తున్నారు.