AP: చెరువు ఆక్రమణల నోటీసులపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఫామ్‌హౌజ్ వద్ద ఇరిగేషన్‌కు సంబంధించిన భూములు లేవని, నోటీసులపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. తన పరువుకు భంగం కలిగించిన వారిపై లీగల్‌గా వెళ్తానని వెల్లడించారు. కాగా.. ధర్మవరం వడియార్ చెరువు అక్రమణలపై కేతిరెడ్డి సోదరుడి భార్య వసుమతికి అధికారులు నోటీసులిచ్చారు.