TG: ఉమ్మడి నల్గొండలో అక్రమ అరెస్టులను మాజీమంత్రి హరీశ్‌రావు ఖండించారు. కార్యకర్తలను గృహనిర్బంధం చేస్తే ప్రజల మద్దతు లభించదన్నారు. మూసీ మురికి కూపంగా మారడానికి 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణం కాదా? అని ప్రశ్నించారు. పాదయాత్ర కాదు.. పాప పరిహారయాత్ర చేసినా కాంగ్రెస్ పాపం పోదన్నారు. హైదరాబాద్‌లో ఇళ్లు కూల్చి నల్గొండలో పాదయాత్ర చేస్తారా? అని నిలదీశారు. హైదరాబాద్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు.