ఐపీఎల్ మెగా వేలంలో ఇంగ్లాండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్ రూ.1.25 కోట్లతో తన పేరును నమోదు చేసుకున్నాడు. దీనిపై తాజాగా ఏబీ డివిలియర్స్ స్పందించారు. ఎంతో అనుభవం ఉన్న అండర్సన్ యువ ఆటగాళ్లకు ఎన్నో విలువైన సూచనలు ఇస్తాడని తెలిపారు. తానే ఫ్రాంఛైజీ యజమానినైతే అండర్సన్‌ను రూ.2 నుంచి 3 కోట్లకు కొనుగోలు చేస్తానని చెప్పారు.