అమెరికాలో టీ10 క్రికెట్ లీగ్‌కు ఆదరణ పెంచేందుకు ఐసీసీ శ్రమిస్తోంది. ఈ లీగ్‌లో పఠాన్, ఉతప్ప, దినేశ్ కార్తీక్, రైనా, వార్నర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు. భారత దిగ్గజం ఎంఎస్ ధోనీ సైతం ఈ లీగ్‌లో ఆడే అవకాశం లేకపోలేదని టీ టెన్ గ్లోబల్ స్పోర్ట్స్ వ్యవస్థాపకుడు షాజీ ఉల్ ముల్క్ అభిప్రాయపడ్డాడు. దీనిపై ధోని ఎలా స్పందిస్తాడో చూడాలి.